ఫేస్బుక్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను.. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పాలకొల్లుకు చెందిన తన్నీడి నాగరాజు, గుత్తుల మురళీకృష్ణ బాబు.. అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి బారిన పడిన ఓ బాధితుడి దగ్గర... 5 లక్షల 75 వేల రూపాయిల నగదు, ఒక బ్రాండ్డ్ వాచ్ దోచుకున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 70 వేల నగదు, ఒక ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి ఘటనలపై యువత అప్రమత్తంగా ఉండాలని మోసపోవద్దని పోలీసులు సూచించారు.
ఫేస్బుక్లో చాటింగ్.. పరిచయమయ్యాక చీటింగ్ - latest news of cyber crime news
ఫేస్బుక్లో అమ్మాయిల పేరుతో నకీలు ఖాతాలు తెరిచి చాటింగ్ చేస్తారు. రెచ్చగొట్టి అసభ్య వీడియోలు పంపేలా చేస్తారు. ఆఖరికి బెదిరింపులతో అసలు సినిమా చూపిస్తారు. అడిగినంత డబ్బులివ్వకపోతే వీడియోలు నెట్టింట వైరల్ అవుతాయని వేధిస్తారు. ఇలాంటి పనులు చేసే బృందాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
![ఫేస్బుక్లో చాటింగ్.. పరిచయమయ్యాక చీటింగ్ Facebook cheaters arrested in west godavari dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6143074-1026-6143074-1582222560591.jpg)
ఫేస్బుక్ మోసగాళ్లను పట్టుకున్న పోలీసులు