పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కృష్ణంపాలెంలో క్షుద్రపూజల అలజడి.. స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గ్రామంలో వారం రోజులుగా మహిళతో కొందరు క్షుద్ర పూజలు చేస్తున్నారని.. ఆ కుటుంబాన్ని ఊరి నుంచి పంపించేయ్యాలంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
పూజకు వినియోగించిన వస్తువులను కాల్చి వేశారు. గతంలో ఒకరు అనారోగ్యం లేకుండా మరణించాడని గుర్తు చేసుకున్నారు. పోలీసులు మాట్లాడినా వారు శాంతించలేదు. గ్రామం నుంచి పంపేయాలని పట్టుబట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్టు జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వర నాయక్ వెల్లడించారు.