పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం లక్ష్మీనారాయణ దేవిపేటలో ఎక్సైజ్ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. దాడుల్లో 4 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దొరక్కపోవడంతో మన్యం మండలాల్లో నాటుసారా వ్యాపారం జోరుగా సాగుతోంది. జంగారెడ్డిగూడెం, పోలవరం సర్కిల్ పరిధిలో అనేక చోట్ల నాటుసారా బట్టీలు వెలుస్తున్నాయి. అన్నిచోట్లా దాడులు ముమ్మరం చేసి నాటుసారా తయారుచేసే వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
4 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన పోలీసులు - liquror news in west godavari dst
మద్యం దొరక్క మందుబాబులు విలవిల్లాడిపోతున్నారు. ఇదే అదునుగా నాటుసారా వ్యాపారం ఊపందుకుంది. ఎక్కడికక్కడ నాటుసారా తయారీదారులు దందాకు తెరలేపుతున్నారు. వీరిపై ఎక్సైజ్ అధికారులు పంజా విసురుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 4వేల లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు.

4వేల లీటర్ల బెల్ల ఊటను ద్వసం చేసిన పోలీసులు