పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం కంచనగూడెం గ్రామంలో నాటుసారాను అరికట్టాలంటూ శుక్రవారం ఎక్సైజ్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ సుధ గతంలో నాటుసారా తయారు చేసిన వారిని పిలిచి.. నాటుసారా తయారీ, విక్రయాలు చేయడం నేరమని తెలిపారు. అయితే అందరి ముందు నిలబెట్టి విచక్షణారహితంగా తమను కొట్టారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులే నిబంధనలు ఉల్లఘించారు..న్యాయం చేయండి - ఎక్సైజ్ శాఖ వార్తలు
దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్న వేల గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా ఎక్సైజ్ అధికారులు అందరి ముందు తమను కొట్టారని పశ్చిమగోదావరి జిల్లా కంచనగూడెం గ్రామంలో పలువురు ఆరోపించారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కంచనగూడెం గ్రామంలో ఎక్సైజ్ అధికారులు సమావేశం
తాము ఏదైనా తప్పు చేస్తే అరెస్టు చేసి, స్టేషన్లో విచారించాలే గాని ఇలా అందరిముందు కర్రలతో కొట్టడం దారుణమన్నారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రజలు ఇంటికే పరిమితమవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునివ్వగా గ్రామంలో సుమారు యాభై, ఆరవై మందిని ఒకేచోట చేరి సమావేశం నిర్వహించడంపై ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చూడండి...
ఇనుమూరులో ఇరవై అడుగుల నాగపాము హతం
TAGGED:
లాక్డౌన్ తాజా వార్తలు