రాష్ట్రంలో సీఎం జగన్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా త్వరలో క్వీట్ జగన్ ఉద్యమం వస్తుందని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని తన నివాసంలో నిరసన దీక్ష చేశారు. సీఎం జగన్ పాలన బ్రిటిష్ పరిపాలనను గుర్తు చేస్తుందన్నారు. అక్రమాలను నిలదీస్తుంటే తట్టుకోలేక అచ్చెన్నాయుడుపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయించిందన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
'త్వరలో క్విట్ జగన్ ఉద్యమం వస్తుంది' - updates on acchennaidu arrest
అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు నిరసన దీక్ష చేశారు. అక్రమాలను నిలదీస్తుంటే తట్టుకోలేక అచ్చెన్నాయుడుపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయించిందని ఆరోపించారు.
అచ్చెన్నాయుడు అరెస్టుపై మాధవ నాయుడు
ఇటు తెదేపా నాయకులు పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: 'ప్రయాణం వల్లే అచ్చెన్నకు గాయం పెరిగింది'
Last Updated : Jun 13, 2020, 4:05 PM IST