పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆసుపత్రికి తరలించినా.. ఆక్కడ కూడా ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు వెల్లడించినా.. ఆహారం తీసుకోకుండా ఆయన దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన మాధవ నాయుడు.. జిల్లా కేంద్రం విషయంలో నరసాపురానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు, వైకాపా కార్యకర్తలు రౌడీల్లా వ్యవహరించి తన అనుచరులను తీవ్రంగా కొట్టి గాయపరిచారని ఆరోపించారు.
"నరసాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే వరకూ దీక్ష కొనసాగిస్తా" - మాధవనాయుడు తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్నారు. నరసాపురానికి అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నరసాపురం కేంద్రంగానే జిల్లా ఏర్పాటు చేసే వరకూ ఆమరణ దీక్షను కొనసాగిస్తానని మాధవనాయుడు స్పష్టం చేశారు.
నరసాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే వరకూ దీక్ష కొనసాగిస్తా