ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద బాధితులకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని పరామర్శ - దెందులూరు వరద న్యూస్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ప్రవాహాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. బాధితులను పరామర్శించారు.

ex mla chintamaneni prabhakar
వరద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని

By

Published : Oct 14, 2020, 5:24 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం, దెందులూరు ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లు, పొలాలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. గుండేరు డ్రైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.

గుండేరు డ్రైన్​ను మరో 5 మీటర్లు వెడల్పు చేయాలని సూచించారు. ఇళ్లలోకి వరద నీరు చేరిన తీరును పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. వారికి పునరావాసం ఏర్పాటు చేయటంలో అధికారులు, ప్రభుత్వం విఫలమైందన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details