ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు: మాజీ మంత్రి

ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తున్నందుకే తనపై సోషల్ మీడియాలో వైకాపా అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుంటే ప్రభుత్వం స్పందించటం లేదని మండిపడ్డారు.

By

Published : Aug 28, 2019, 5:31 PM IST

భాజపా

మీడియా సమావేశంలో మాణిక్యాలరావు

సోషల్ మీడియాలో తనపై వచ్చిన అసత్య ప్రచారాలపై మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఘాటుగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం భాజపా క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. తన చిత్రాలను మార్ఫింగ్ చేసి శ్రద్ధాంజలి అని, ప్రమాదంలో మృతి అని దుష్ప్రచారం చేశారని అన్నారు. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.

హిందూ దేవాలయాల భూములు, నిధులను అనుచర గణానికి పంచిపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ చూస్తున్నారని మాణిక్యాలరావు ఆరోపించారు. దేవాదాయ భూములపై మాట్లాడుతున్న ప్రభుత్వం... రాష్ట్రంలోని వేలాది ఎకరాల క్రైస్తవ భూములపై ఎందుకు నోరు ఎత్తటం లేదని నిలదీశారు. ప్రభుత్వ తప్పిదాలను లెవనెత్తితే తనపై వైకాపా మద్దతుదారులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం హేయమైన చర్య అని అన్నారు. తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతుంటే ప్రభుత్వం కళ్లుమూసుకుందని విమర్శించారు. ఈ చర్యలన్నీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు.
దేవాలయ భూములపై ప్రభుత్వాలకు హక్కు లేదన్నారు. హిందూ ఆలయ ఆస్తులతో పాటు అమరావతి నిర్మాణంపై ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రభుత్వం వీటిపై స్పష్టత ఇవ్వకుంటే రాష్ట్ర విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడానికి వెనకాడదని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details