ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి: మాజీ మంత్రి కామినేని - మోదీ పర్యటన

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 4న భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్నిప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ భాజపా శ్రేణులతో చర్చించారు.

కామినేని
కామినేని

By

Published : Jul 2, 2022, 7:35 PM IST

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 4న భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు భాజపా శ్రేణులు సమాయత్తమయ్యాయి. మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగతం పలకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కామినేని భాజపా శ్రేణులతో చర్చించారు. కార్యక్రమం విజయవంతం కావటానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు

ABOUT THE AUTHOR

...view details