అందరి 'నోట' అదే మాట - westgodavari district newsupdates
పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటకు చోటు కల్పించారు. వాటితో కలిపి బ్యాలెట్ పత్రాలు సిద్ధమవతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప తేడా కూడా విజయావకాశాలను దెబ్బ తీస్తుంది.

పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటకు చోటు కల్పించారు. వాటితో కలిపి బ్యాలెట్ పత్రాలు సిద్ధమవతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప తేడా కూడా విజయావకాశాలను దెబ్బ తీస్తుంది. ఇప్పుడు నోటా వచ్చిందంటే జాతకాలు తారమారు అవుతాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 2013లో 4 రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల్లో తోలిసారిగా నోటాను ఈవీఎంలలో ప్రవేశ పెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోను ఉపయోగించారు. 2019 ఎన్నికల్లో నోటా మీట నొక్కిన వారి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడా గుర్తు బ్యాలెట్ పత్రాల్లోనూ చోటు సంపాదించుకుంటోంది. అభ్యర్థులందరి గుర్తుల తర్వాత చివర్లో ఇది ఉంటుంది. ఇన్నాళ్లూత పోటేచేసే అభ్యర్థులెవరూ నచ్చకపోయినా తప్పనిసరై ఎవరో ఒకరికి వేస్తున్నారు. ఇప్పుడు నోటా రావటంతో అది అభ్యర్థుల జయాపజయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.