పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రైతు బజారులో శానిటైజేషన్ కోసం అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసే టన్నెల్ ను ఏర్పాటు చేశారు. కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలుకు రైతు బజారు వచ్చే ప్రజలు ఈ టన్నెల్ లోపలికి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. మిశ్రమ ద్రావణాన్ని పిచికారి చేయడం వల్ల లోపలికి వెళ్లి వచ్చే వారికి వైరస్ ప్రభావం ఉండే అవకాశం ఉండదని నిర్వాహకులు అన్నారు.
భీమవరంలో శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు - corona virus effect in bheemavaram
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసే టన్నెల్‌ను ఏర్పాటు చేశారు.

భీమవరంలో శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు