పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జైన్స్ సంఘం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు డీఎస్పీ కె.నాగేశ్వరరావు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్డౌన్తో ఆటోవాలాలు ఇబ్బందులు పడుతున్నందున నిత్యావసర సరకులు పంపిణీ చేశామని దాతలు తెలిపారు. కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని డీఎస్పీ కోరారు.
ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువుల పంపిణీ - నర్సాపురంలో నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. తమ వంతు సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
![ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువుల పంపిణీ essential needs distribution for auto drivers in narasapuram west godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7029620-549-7029620-1588414715974.jpg)
ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ