ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆపదలో పేదవారికి అండగా..

కరోనా మహమ్మారి కారణంగా పనుల్లేక పస్తులుంటున్న.. పేదలు, అభాగ్యులకు చేయూతనిస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు కొంతమంది దాతలు. ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం, సరకులు, కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తూ ఆపదలో తోడుగా నిలుస్తున్నారు.

By

Published : Apr 11, 2020, 6:09 AM IST

ఆపదలో పేదవారికి తోడుగా
ఆపదలో పేదవారికి తోడుగా

లాక్‌డౌన్ వల్ల సమస్తం స్తంభించిపోవటం వల్ల అనేక మంది నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆహారం, కూరగాయలు పంపిణీ చేస్తూ వారి ఆకలి తీర్చుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం న్యాయంపల్లి గ్రామంలో కొందరు విరాళాలు వేసుకుని ఒక్కో కుటుంబానికి 7 కేజీల చొప్పున కూరగాయలు పంపిణీ చేశారు.

న్యాయంపల్లిలో పేదలకు కూరగాయల పంపిణీ

తణుకు పట్టణ పరిధిలోని వివిధ వార్డు వాలంటీర్లకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్లు నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.

వార్డు వాలంటీర్లకు కూరగాయలు పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతలు, కార్యకర్తలు వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడు గ్రామంలో ప్రజలకు, మిర్చి కోతలకు వచ్చిన వలస కూలీలకు గ్రామ తెదేపా అధ్యక్షుడు పాతూరి కృష్ణారావు, కార్యకర్తలతో కలిసి కూరగాయలను ఇంటింటికి పంపిణీ చేశారు.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలోని కటారివారిపాలెం, అక్కయిపాలెంలో చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మొబైల్ రైతు బజార్​ను ఏర్పాటుచేశారు. ఏఎంసీ ఛైర్మన్ ఆధ్వర్యంలో మొబైల్ రైతు బజార్ ద్వారా అతి తక్కువ ధరలకు కూరగాయలు పంపిణీ చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో సీపీఎం పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 120 పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు.

గుడ్ ఫ్రైడే సందర్భంగా 100 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రోజువారి పనులు చేసుకునే కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్న సుమన్ అనే వ్యక్తి తనకొచ్చిన జీతంలో పేదలకు తోడుగా నిలుస్తున్నాడు. గుడ్ ఫ్రైడే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువులో 100 మందికి పైగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:చంద్రగిరి ప్రజలకు ఉచితంగా కోడిగుడ్లు పంపిణీ

ABOUT THE AUTHOR

...view details