కరోనా మహమ్మారి రెండోసారి విజృంభించడంతో ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొవిడ్ బారినపడిన బాధితులలో పేద, బడుగు వర్గాలకు చెందిన కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఉందుర్తి పాల్ ఫౌండేషన్ కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న పేద, బడుగు వర్గాల కుటుంబీకులకు దాతల సహకారంతో ఆపన్నహస్తం అందిస్తోంది.
కరోనా బాధితులకు బాసటగా.. ఉందుర్తి పాల్ ఫౌండేషన్ - తణుకులో పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ
కరోనా బాధితులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఉందుర్తి పాల్ ఫౌండేషన్ తణుకు, ఇరగవరం, ఉండ్రాజవరం మండలాల్లోని పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేసింది.
![కరోనా బాధితులకు బాసటగా.. ఉందుర్తి పాల్ ఫౌండేషన్ tanuku](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:06:34:1621596994-ap-tpg-11-21-help-to-carona-victims-ab-ap10092-21052021140219-2105f-1621585939-1068.jpg)
తణుకులో పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ
తణుకు, ఇరగవరం, ఉండ్రాజవరం మండలాలతో పాటు వివిధ గ్రామాల్లో సేవలు చేస్తోంది. సుమారు రెండు వందల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం అందించారు. స్థానిక ఏఎన్ఎంలు, గ్రామ వాలంటీర్ల సహకారంతో బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ప్రస్తుత కష్టకాలంలో బాధితుల ఇబ్బందులను గుర్తించి దాతల సహకారంతో తాము ముందుకు నడుస్తున్నామని నిర్వాహకులు ప్రసన్న కుమార్ అన్నారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి పేద, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
TAGGED:
తణుకులో ఉందుర్తి పాల్ ఫౌండేషన్