పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో విధి నిర్వహణలో ఉన్న ఓ ఉద్యోగి హఠాత్తుగా మృతి చెందారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సబార్డినేట్ గా పనిచేస్తున్న సత్యనారాయణ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.
వెంటనే తోటి ఉద్యోగులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వివాదరహితుడిగా గుర్తింపు పొందిన సత్యనారాయణ మృతి పట్ల తోటి సిబ్బంది, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన చెందారు.