రెడ్‌జోన్ ప్రాంతమైన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఏలూరు రేంజ్ డీఐజీ కె.వి.మోహన్ రావు పర్యటించారు. ఈ ప్రాంతం పరిధిలోని చెక్‌పోస్ట్‌లు తనిఖీ చేశారు. కరోనా కేసుల నమోదుపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైరస్ లక్షణాలు ఉన్న వారి సమాచారాన్ని ప్రభుత్వ, పోలీసు అధికారులకు తెలపాలని సూచించారు. ఏలూరు రేంజ్ పరిధిలో 27 రెడ్ జోన్ ప్రాంతాలు ఉన్నట్లు డీఐజీ తెలిపారు.
రెడ్‌జోన్ ప్రాంతంలో ఏలూరు రేంజ్ డీఐజీ పర్యటన - latest news on redzone news in westgodavari
రెడ్‌జోన్ ప్రాంతమైన పెనుగొండలో కరోనా కేసుల నమోదు, వాటి నియంత్రణకు వైద్యులు తీసుకుంటున్న చర్యలపై ఏలూరు రేంజ్ డీఐజీ ఆరా తీశారు.
![రెడ్‌జోన్ ప్రాంతంలో ఏలూరు రేంజ్ డీఐజీ పర్యటన elure DIG visited red zone areas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6909148-819-6909148-1587665509265.jpg)
రెడ్‌జోన్ ప్రాంతంలో ఏలూరు రేంజ్ డీఐజీ పర్యటన