ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ జేఏసీ ధర్నా - జేఏసీ తాజా వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని విద్యుత్ భవనం వద్ద ఎస్ఈఈఈ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం 2020ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగులు కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు.

Electricity workers protest for central government
విద్యుత్​ ఉద్యోగుల ధర్నా

By

Published : Jun 1, 2020, 3:47 PM IST

విద్యుత్ సంస్థలను తద్వారా వినియోగదారులను కాపాడాలని, ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చే సవరణ చట్టం నిలిపివేయాలని జేఏసీ నాయకుడు భూక్య నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏలూరులోని విద్యుత్ భవనం వద్ద ఏపీ ఎస్ఈఈఈ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం 2020ను రద్దు చేయాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగులు కార్మికులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details