రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల నిర్వహణకు సర్కారు సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించి అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, అధికారులు, సిబ్బంది వివరాలను అందజేయాలని సహకార శాఖ కమిషనర్ వాణీమోహన్ పశ్చిమగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సహకార సంఘాల నుంచి సమాచారం వచ్చిన వెంటనే క్రోడీకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని జిల్లా శాఖ అధికారి తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా.. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సహకార అధికారులు స్పష్టం చేశారు.
త్వరలో వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
త్వరలో వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలు