పశ్చిమగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం తొలి గంటలో పోలింగ్ మందకొడిగా సాగగా.. 9:00 నుంచి జోరుగా సాగింది. జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం, కుక్కునూరు, ఏలూరుపాడు మండలాల్లో.. తొలి గంటలో 10 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులకు తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ - పశ్చిమగోదావరిలో పంచాయతీ ఎన్నికలు వార్తలు
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. పశ్చిమగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం తొలిగంటలో పోలింగ్ మందకొడిగా సాగగా.. 9గంటల నుంచి జోరుగా సాగుతోంది.
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్