పశ్చిమగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఎంత ప్రశాంతంగా నిర్వహించామో.. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిసేలాగా కృషి చేయాలని ఎన్నికల పరిశీలకుడు లత్కర్ శ్రీకేశ్ బాలాజీ కోరారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ నమోదైందని.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా ఓటింగ్ నమోదు కావాలని కోరారు.
'మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా కృషి చేయాలి' - ఏపీ మున్సిపల్ ఎన్నికలు న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకుడు లత్కర్ శ్రీకేశ్ బాలాజీ పరిశీలించారు. నామినేషన్ ఉపసంహరించుకునే అభ్యర్థులను ఎందుకు నామినేషన్ ఉపసంహరించుకుంటున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
election observer on muncipal elections in west godavari