ఎన్నికల ప్రచారంలో పార్టీల జోరు పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో తెదేపా, వైకాపాలు ఒకరికి ఒకరు పోటీ పడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుమండలంలోని నల్లమాడు, కొత్తగూడెం, గోపినాధపట్నంతదితరగ్రామాల్లోపర్యటించి ఓట్లను అభ్యర్థించారు. వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందని విమర్శించారు. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు అక్కుపల్లి గోకవరం, తిమ్మాయపాలెంతో పాటు పలుగ్రామాలలో పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు.జగన్మోహన్ రెడ్డితోనే రాజన్న రాజ్యం వస్తుంది అన్నారు. ఐదేళ్ళ తెలుగుదేశం పాలనలో అవినీతి, రౌడీయిజం పెరిగిపోయిందన్నారు.
ఇవి చదవండి