ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 7, 2021, 11:00 PM IST

ETV Bharat / state

ప్రచార హోరు ముగింపు.. తొలి పోరుకు యంత్రాంగం సంసిద్దం

పశ్చిమ గోదావరి జిల్లాలో తొలివిడత ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు అభ్యర్థుల హోరా హోరీ ప్రచారం పూర్తయింది. ?ఎన్నికల ఏర్పాట్లను సబ్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ వివరించారు. పోలింగ్ సరళికి కావలసిన అన్ని ఏర్పాట్లనూ పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్టు తెలిపారు.

election arrangements in west godavari district by sub collector
ప్రచార హోరు ముగింపు.. తొలి పోరుకు యంత్రాంగం సంసిద్దం

పశ్చిమ గోదావరి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని సబ్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా డివిజన్ పరిధిలో నిర్వహించనున్న ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ నిర్వహణపై సబ్ కలెక్టర్ విశ్వనాధన్ 2,552వార్డులలో 1071 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని, మిగిలినవాటికి ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు 149 స్టేజ్ వన్, 271మంది స్టేజ్ టూ అధికారులను నియమించామన్నారు. 82 మంది రూట్ ఆఫీసర్లు, 36 మంది జోనల్ అధికారులు, 12 ఫ్లయింగ్ స్క్వాడ్, 24 స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీమ్ లు ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్నాయని వివరించారు.

42 సమస్యాత్మక, 13 అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీలను గుర్తించామని.. ఈ ప్రాంతాల్లో బలగాల మోహరింపును పెంచామని చెప్పారు. ఇక్కడ మైక్రో అబ్జర్వర్ లు ఎప్పటి కప్పుడు నివేదిక ఇస్తారన్నారు. 72 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రక్రియను వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను వినియోగిస్తూ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిని ఉచిత రవాణాతో పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. ప్రక్రియ పూర్తవగానే తిరిగి వారి వారి మండలాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు.

హోరాహోరీగా సాగి ముగిసిన తొలివిడత ఎన్నికల ప్రచారం..

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డివిజన్ లో తొలివిడత ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. గత ఐదు రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడటంతో పోలింగ్ పై దృష్టి సారించారు. గెలుపు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఇదీ చదవండి:

ద్వారకా తిరుమల శ్రీవారికి వెండి ఖడ్గం బహుకరణ

ABOUT THE AUTHOR

...view details