ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరులో హోరాహోరీగా 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ - eenadu sports legue

ఈనాడు స్పోర్ట్స్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ మ్యాచ్​ ఏలూరులో ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో శ్రీవాసవి ఇంజినీరింగ్ కళాశాల జట్టు 5 పరుగుల తేడాతో నెగ్గింది.

eenadu-sports-legue
ఏలూరులో హోరాహోరీగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్

By

Published : Dec 22, 2019, 1:09 PM IST

ఏలూరులో హోరాహోరీగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల మైదానంలో జరుగుతున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ జిల్లాస్థాయి క్రికెట్ మ్యాచ్​లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. క్రికెట్ పోటీల్లో మూడో రోజు ఏలూరు రామచంద్ర ఏంబీఏ కళాశాల జట్టుకు, తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లకు 92 పరుగులు చేశారు. అనంతరం 93 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రామచంద్ర ఎంబీఏ కళాశాల జుట్టు 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ABOUT THE AUTHOR

...view details