ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భీమవరంలో ఉత్కంఠ భరితంగా ఈనాడు క్రికెట్ పోటీలు - భీమవరంలో ఈనాడు క్రికెట్ పోటీలు

భీమవరంలో ఈనాడు క్రికెట్ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. డీఎన్ఆర్ కళాశాల జట్టు బీవీరాజు డిగ్రీ కళాశాల జట్టుపై విజయం సాధించింది.

eenadu cricket
భీమవరంలో ఈనాడు క్రికెట్ పోటీలు

By

Published : Dec 22, 2019, 7:59 PM IST

భీమవరంలో ఈనాడు క్రికెట్ పోటీలు

ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 క్రికెట్ పోటీలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు తొలి మ్యాచ్ డీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల జట్టు, బీవీ రాజు డిగ్రీ కళాశాల జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బీవీ రాజు డిగ్రీ కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 57 పరుగులు సాధించింది. 58 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన డీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల జట్టు 7.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ABOUT THE AUTHOR

...view details