పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019 క్రికెట్ పోటీలు ఏడో రోజుకు చేరుకున్నాయి. స్థానిక కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మొదటి మ్యాచ్లో భీమవరం డీఎన్ఆర్ డిగ్రీ కళాశాల-తణుకు ఎంసీఎస్ డిగ్రీ కళాశాల జట్ల మధ్య పోటా పోటీగా సాగిన మ్యాచ్లో ఎంసీఎస్ కళాశాల విజయాన్ని అందుకుంది. రెండో మ్యాచ్లో పెనుగొండ ఎస్వీకేపీ అండ్ కేఎస్ రాజు కళాశాల-నరసాపురం శ్రీ వై.ఎన్ డిగ్రీ కళాశాల జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా కొనసాగిన ఈ మ్యాచ్లో శ్రీ వై.ఎన్ కళాశాల జట్టు రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
భీమవరంలో యువ క్రీడాకారుల మధ్య ఉత్కంఠ పోరు - eenadu cricket tournment news in bheemavaram
ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019 క్రికెట్ పోటీలు భీమవరం కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో హోరాహోరీగా సాగుతున్నాయి. యువ క్రీడాకారులు నువ్వా-నేనా అన్నట్లు పోటాపోటీగా తలపడుతున్నారు.
భీమవరంలో ఏడో రోజుకు చేరుకున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్