పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కేజీఆర్ఎల్ కళాశాల క్రీడామైదానంలో ఈనాడు పోటీలు ఉల్లాసంగా జరిగాయి. మొదటి మ్యాచ్ భీమవరం ఎస్ఆర్కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల జట్ల మధ్య హోరాహోరీగా జరుగగా... ఎస్ఆర్కెఆర్ కళాశాల జట్టు విజయం సాధించింది.
రెండవ మ్యాచ్ నరసాపురం శ్రీ వైఎన్ డిగ్రీ కళాశాల ,తణుకు ఎంసీఎస్ డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరుగగా.... శ్రీ వైఎన్ డిగ్రీ కళాశాల జట్టు గెలిచింది. మూడవ మ్యాచ్ భీమవరం కేజీర్ఎల్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్, భీమవరం కేజీర్ఎల్ ఫార్మసీ కళాశాల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగగా... కేజీర్ఎల్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్ జట్టు విజయం సాధించింది.