పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్లమ్మ వారిని, పంచారామ క్షేత్రమైన సోమేశ్వరస్వామిని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలో ఏర్పాటుచేసిన బ్రాహ్మణ సమైక్య సమావేశంలో ఉపసభాపతి పాల్గొన్నారు. గ్రామ వాలంటీర్లంతా సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 70 నుంచి 80 శాతం మంది వాలంటీర్లు తమ విధులను చక్కగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. పౌర సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ప్రభుత్వ పథకాలను త్వరితగతిన ప్రజలకు చేరువచేసేందుకు వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు.
భీమవరం మావుళ్లమ్మ ఆలయానికి ఉపసభాపతి - mavullamma temple
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి పర్యటించారు. పట్టణంలోని మావుళ్లమ్మ, సోమేశ్వరస్వామి దేవస్థానాలను వైకాపా ఎమ్మెల్యేలతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం బ్రాహ్మణ సమైక్య సమావేశంలో పాల్గొన్నారు.
భీమవరం మావుళ్లమ్మ దర్శించుకున్న ఉపసభాపతి