ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళల ఆగ్రహం.. యూనియన్​ బ్యాంకు అద్దాలు ధ్వంసం

Dwarka Womens on Bhimadolu union bank: డ్వాక్రా మహిళల ఖాతాలో రూ.1.2 కోట్లు గోల్​మాల్​ వ్యవహారంలో పొలసానిపల్లి యూనియన్​ బ్యాంకు కార్యాలయ అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ మోసానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

Dwarka Womens at union bank
యూనియన్​ బ్యాంకు వద్ద డ్వాక్రా మహిళలు

By

Published : Feb 8, 2022, 2:01 PM IST

Dwarka Womens on Bhimadolu union bank: పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లిలో యూనియన్​ బ్యాంకు కార్యాలయాన్ని పాతూరు గ్రామానికి చెంది డ్వాక్రా మహిళలు ముట్టడించారు. ఖాతాలో రూ.1.2 కోట్ల గోల్​మాల్​పై బ్యాంకు వద్ద భారీగా మహిళలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.

బ్యాంకులోకి రానివ్వకుండా అధికారులు తాళాలు వేసుకుని లోపలే ఉండిపోయారు. మరింత ఆగ్రహించిన మహిళలు కార్యాలయ కిటికీ అద్దాలను పగులగొట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం ఫలితం లేకపోయింది. బ్యాంకు ముందు, రహదారిపై బైఠాయించి వాహన రాకపోకలను అంతరాయం కలిగించారు.

యూనియన్​ బ్యాంకు వద్ద డ్వాక్రా మహిళలు

అసలేంజరిగిందంటే...

Dwarka Womens on Bhimadolu union bank: ఇటీవల యూనియన్​ బ్యాంకు సీసీ రేణుక, మేనేజర్, మరో ఉద్యోగి కలిసి సుమారు రూ.1.2 కోట్లు డ్వాక్రా మహిళల ఖతాలో రుణాలు కాజేశారని మహిళలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై గ్రామంలోని 36 గ్రూపులకు చెందిన మహిళలు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ అవకతవకలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు తమకు కొంత గడువు ఇవ్వాలని మహిళలను బ్యాంకు ఆర్ఎం కోరారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శాంతించిన మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇది చదవండి: చిన్నారిపై పెంపుడు తల్లి కర్కశత్వం.. ఒళ్లంతా వాతలు పెట్టి చిత్ర హింసలు !

ABOUT THE AUTHOR

...view details