ద్వారకా తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రసాదాల తయారీలో ఉపయోగించే 1100 కేజీల నెయ్యి పక్కదారి పట్టింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ ఈవో ఆర్ ప్రభాకర్ రావు ప్రాథమిక విచారణ జరిపి బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్ మద్దాల శ్రీనుని సస్పెండ్ చేశారు. ఏఈవో చిలుకూరి సూర్యనారాయణ, సూపరింటెండెంట్ రమణ రాజులకు మెమోలు జారీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా నెయ్యి పక్కదారి పట్టిన సమయంలో ప్రసాదాల తయారీ విభాగాన్ని పర్యవేక్షించిన దేవస్థానం ఏఈవో చిలుకూరి సూర్యనారాయణ, సూపరింటెండెంట్ రామణరాజు, సీనియర్ అసిస్టెంట్ మద్దాల శ్రీనులను భ్రమరాంబ విచారించారు. వారి స్టేట్ మెంట్లను నమోదు చేసుకున్నారు.
ద్వారకా తిరుమల ఆలయంలో 1100 కేజీల నెయ్యి స్వాహా
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలోని ప్రసాదాల తయారీ విభాగంలో నెయ్యి పక్కదారి పట్టిన వైనంపై దేవాదాయ శాఖ రాజమహేంద్రవరం ప్రాంతీయ సంయుక్త కమిషనర్ భ్రమరాంబ విచారణ చేపట్టారు. రూ.5.28 లక్షల విలువ చేసే 1100 కేజీల నెయ్యి దారి తప్పినట్లు జులై 7న ఆలయ అధికారులు గుర్తించారు.
dwaraka tirumala