పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న ప్రభాకరరావును తన మాతృ శాఖకు బదిలీ చేయాలని దేవాదాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జీఎస్వీ ప్రసాద్ ఎండోమెంట్ స్పెషల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆ స్థానంలో మరొకరిని నియమించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు ప్రభాకర్ రావు ఏలూరు డిప్యూటీ కలెక్టరుగా పని చేశారు. ఆ సమయంలో ఏసీబీ అధికారులమంటూ కొంతమంది ప్రభాకర్ రావు నుంచి 1.97 లక్షలు వసూలు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అసలు ఈ సొమ్ము ఎందుకు జమ చేయాల్సి వచ్చిందనే కోణంలో అనిశా దేవస్థానంలోని అన్ని విభాగాల్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
'ద్వారకా తిరుమల దేవస్థానం ఈవోని మాతృశాఖకు బదిలీ చేయండి' - ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో బదిలీ న్యూస్
ద్వారకా తిరుమల దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న ప్రభాకరరావును తన మాతృ శాఖకు బదిలీ చేయాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయనపై అనిశా విచారణ జరుగుతున్నందున గతంలో పనిచేసిన శాఖకు బదిలీ చేయాలన్నారు.

ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో మాతృశాఖకు బదిలీ చేయండి