ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిజ ఆశ్వయుజ మాస తిరు కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అర్చకులు పండితులు అంకురార్పణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. తొలుత మంగళవాయిద్యాలతో అర్చకులు పుట్టమన్ను తెచ్చారు. ఆలయ ఆవరణలో పాలికల్లో ఈ పుట్టమన్ను ఉంచి నవధాన్యాలను పోసి అంకురార్పణ జరిపారు. అనంతరం ధ్వజారోహణ జరిపి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సకల దేవతలను ఆహ్వానించేలా గరుడ పటాన్ని ఎగరవేశారు. ముహూర్త సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
ద్వారకాతిరుమలలో వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం
పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.
ద్వారకతిరుమలలో వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం