ద్వారకా తిరుమల క్షేత్ర దేవతగా విరాజిల్లుతున్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. తొమ్మిది రోజులు అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆఖరి రోజు అమ్మవారి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ.. మహిళలు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ యాగశాలలో చండీ హోమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కలశ ఉద్వాసన వంటి పూజాది కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా పరిమిత సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ద్వారకా తిరుమల కుంకుళ్లమ్మ ఆలయంలో ముగిసిన నవరాత్రి వసంతోత్సవాలు - today dwaraka tirumala nukallamma jatara latest update
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీ కుంకుళ్లమ్మ ఆలయంలో జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఆఖరి రోజు సామూహిక కుంకుమ పూజలు, చండీ హోమం, కలశ ఉద్వాసన వంటి పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
vasantha navaratri last day