ద్వారకా తిరుమలలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం కన్నుల పండువగా సాగింది. శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోవింద నామస్మరణల నడుమ ఆలయ అర్చకులు వేదమంత్రాలు చదువుతూ ఉత్తర ద్వారాలు తెరిచి దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా ఆలయ అర్చకులు పండితులు ఉత్తర ద్వారం వద్ద గరుడ వాహనంపై విశేషంగా అలంకరించిన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారాలు తెరిచి సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు.
ద్వారకా తిరుమలలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం
శ్రీమహావిష్ణువును ఇలలో దర్శించుకోవడంతో వైకుంఠ ప్రాప్తి కలిగి సర్వపాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ద్వారకా తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దివ్య మంగళ స్వరూపుడైన ద్వారకాతిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్నారు.
dwaraka tirumala
ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తకోటి శ్రీవారి నిజరూప దర్శనం చేసుకుని పులకించింది. గోవింద స్వాములు స్వామివారిని దర్శించుకుని ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండంలో ఇరుముడులు సమర్పించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో క్షేత్ర పరికరాలు, దర్శన క్యూలైన్లు ,ప్రసాదాల కౌంటర్లు భక్కులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.
ఇదీ చదవండి:తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారి సేవలో ప్రముఖులు