రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఆర్థిక చేయూతనివ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సున్నా వడ్డీ పథకం కింద కోటి 11 లక్షల 30 వేల రూపాయల విలువైన చెక్కులను సంఘం ప్రతినిధులకు అందజేశారు. మహిళా సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఇళ్లకు పరిమితమవ్వాలని ఎమ్మెల్యే కోరారు.
'ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఆర్థిక చేయూతనిస్తుంది' - తణుకులో డ్వాక్రా చెక్కులు అందించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో డ్వాక్రా సంఘాలకు కోటి 11లక్షల విలువైన చెక్కులను.. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అందించారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మహిళా సంఘాలకు డ్వాక్రా చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు