అభివృద్ధిని చూడండి.. మళ్లీ అవకాశం ఇవ్వండి! - pracharam
పశ్చిమగోదావరి జిల్లా తణుకు తెదేపా అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ ప్రచార వేగాన్ని పెంచారు. దువ్వలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలు వివరించారు.
దువ్వలో తెదేపా ప్రచారం
By
Published : Mar 15, 2019, 11:47 PM IST
దువ్వలో తెదేపా ప్రచారం
నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసే అధినేత చంద్రబాబు తనకు మళ్లీ టికెట్ ఇచ్చారనిపశ్చిమగోదావరి జిల్లా తణుకు అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ప్రచారంలో భాగంగా దువ్వలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు.గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. మళ్లీ తెదేపా ప్రభుత్వం వచ్చేలా ప్రజలు ఓట్లు వేయాలని కోరారు.