రాష్ట్రం నుంచి రాజస్థాన్‌లోని మౌంట్‌ఆబూకు వెళ్లిన పలువురు.... లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 50 మంది భక్తులు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది తమ పిల్లలను ఇంటివద్దే వదిలి వెళ్లడంతో.... వారంతా భయాందోళనలో ఉన్నారు. తమను సొంత గ్రామాలకు పంపే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
'లాక్‌డౌన్‌తో చిక్కుకున్నాం... మమ్మల్ని ఊరికి చేర్చండి' - లాక్‌డౌన్‌తో మౌంట్‌అబూలో చిక్కుకున్న పశ్చిమగోదావరి వార్తలు
లాక్డౌన్ వల్ల ఎక్కడివాళ్లు అక్కడ ఇరుక్కుపోయారు. ఉన్న చోట సరైన వసతులు లేక సొంత ఊళ్లకి పోలేక అవస్థలు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వాసులు.. గత నెలలో రాజస్థాన్‌లోని మౌంట్అబూ వెళ్లారు. లాక్డౌన్ వల్ల రవాణా వ్యవస్థ స్తంభించటంతో అక్కడే చిక్కుకుపోయారు. ప్రభుత్వం స్పందించి... తమను సొంతగూటికి చేర్చాలని బాధితులు కోరుతున్నారు.
due to corona lockdown west godavari people are locked in Mount Abu in Rajasthan