పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ పదవిని దూదేకులకు చెందిన మహిళకు కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మహిళా సాధికారత సాధన దిశగా ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న భరోసాతో మహిళలు రాజకీయంగా ఎదగాలని సూచించారు.
వెనుకబడిన వర్గాలకు రాజకీయ, సామాజిక ప్రాధాన్యతను ముఖ్యమంత్రి జగన్ కల్పించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నూర్‌బాషా కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ ఫక్రూబీ, ఆ సంస్థ డైరెక్టర్లు పాల్గొన్నారు.