పశ్చిమగోదావరిజిల్లాలో ఆరెంజ్, గ్రీన్ జోన్ల పరిధిలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రెడ్ జోన్ల పరిధిలో మాత్రం.. మద్యం దుకాణాలు మూసివేశారు. సామాజిక దూరం పాటించాలన్న నిబంధనను పలుప్రాంతాల్లో మందుబాబులు ఉల్లంఘించారు.
మాస్కులు లేకుండా మద్యం కోసం క్యూలో... - liquor news in west godavari dst
పశ్చిమగోదావరి జిల్లా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. రెడ్ జోన్ల పరిధిలో మినహాయించి జిల్లా వ్యాప్తంగా మద్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మద్యం ప్రియులు ఎలాంటి మాస్కులు లేకుండానే క్యూ లైన్లో నిలబడ్డారు.
drunkers not wore mask at liquor shops in west godavari dst
ఎలాంటి మాస్కులు పెట్టకోకుండానే కొనుగోలు చేశారు. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాలు రెడ్ జోన్ల పరిధిలోకి రావటం వల్ల... మద్యం దుకాణాలు మూసివేశారు. జిల్లాలో 170 మద్యం దుకాణాలు తెరుచుకోగా.. 195మద్యం దుకాణాలు మూతపడి ఉన్నాయి.
ఇదీ చూడండి:మోదీ 2.0: రెండో ఏడాదిలో తొలి కేబినెట్ భేటీ