పశ్చిమగోదావరి ....పచ్చదనానికి, పైరు గాలులకు పెట్టింది పేరు. వేసవి తాపంతో జలసిరుల నేల కూడ బీడులా మారిపోతుంది. మన్యం ప్రాంతంలో భూగర్భ జలాలు మట్టానికి చేరుకుంటున్నాయి. భానుడి ప్రతాపానికి రైతులతో పాటు మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. ప్రతి వేసవిలోనూ పరిస్థితి దారుణంగా మారిపోతుంది.
భూగర్భ జలాలు అడుగట్టిపోవటంతున్న కారణంతో గోదారి జిల్లాలో కరవు ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. విచ్చలవిడిగా బోర్ల వాడకం, అక్రమ నీటి వ్యాపారం తదితర కారణాలతో వేసవిలో ఈ కష్టాలు తప్పడం లేదు. మన్యంలో ప్రధాన కాలువలు, వాగులు, చెరువులు, కుంటలు ఇప్పటికే ఎండిపోయి బీడులా దర్శనమిస్తున్నాయి.
ఖరీఫ్ సీజన్లో నమోదైన వర్షపాతం మినహా ఈ ఏడాది మన్యంలో పెద్దగా వర్షాలు పడలేదు. సగటున 1070.90 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 4.60 శాతం తక్కువగా నమోదైంది. అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు అప్రమత్తం కాకపోతే రానున్న రోజుల్లో మన్యం నీటి ముప్పును ఎదుర్కోక తప్పదు
జలసిరుల పశ్చిమలో... కరవు ఛాయలు
నీటితో ఎప్పుడు కలకలలాడుతూ... పచ్చని ప్రకృతి అందాలతో ముచ్చటగా ఉండే పశ్చిమ గోదావరి మన్యం... భానుడి ప్రతాపంతో ఎడారిని తలపిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటి రైతులు, మూగ జీవాలు నానా యాతన పడుతున్నాయి.
జలసిరుల పశ్చిమలో... కరవు ఛాయలు
ఇదీ చదవండి