పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని స్పోర్ట్స్ క్లబ్లో రామమందిర నిధి సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఆరెస్సెస్ రాష్ట్ర ప్రచారక్ భరత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి, భాజపా నేత కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు.
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి విరాళాలు అందజేత - Rama Mandir Fund Offering Program news
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని స్పోర్ట్స్ క్లబ్లో రామమందిర నిధి సమర్పణ కార్యక్రమం జరిగింది.
విరాళాలు అందిస్తున్న పలువురు
రామమందిర నిర్మాణానికి పలువురు విరాళాలు ఇచ్చారు. నారాయణపురం గ్రామానికి చెందిన బళ్లా త్రిమూర్తులు రూ.1,11,116, శరణాల అప్పారావు రూ.1,00,116 చెక్కులు అందజేశారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల యజమానులు నగదు రూపంలో సాయం చేశారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.