ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంతుచిక్కని వ్యాధితో చికిత్స పొందుతున్న బాధితులను న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి బాలకృష్ణ పరామర్శించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఏ పని చేస్తున్నారు..? వ్యాధి ఎలా వచ్చింది, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బాధితులను పరామర్శించిన న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి - ELURU LATEST NEWS
కొన్ని రోజులుగా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వ్యాధికి సంబంధించిన కారణాలు తెలియరాలేదు. అనారోగ్యంతో ఉన్న రోగులను న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి పరామర్శించారు.
బాధితులను పరామర్శించిన న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి