హైకోర్టు ఆదేశాల మేరకు రోగుల నుంచి పశ్చిమగోదావరి జిల్లా జడ్జి భీమారావు వివరాలు నమోదు చేశారు. ఆసుపత్రిలో చేరిన బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిట్స్‌తో ఎక్కువమంది ఆస్పత్రిలో చేరారని ఆయన తెలిపారు. లెడ్, నికెల్ కారకాలున్నట్లు ఎయిమ్స్ ప్రతినిధులు ద్వారా తెలిసిందని వివరించారు. ఇంకా పూర్తి నివేదిక రావాల్సి ఉందని..ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎయిమ్స్ రిపోర్ట్ వచ్చాక అన్ని కారణాలను విశ్లేషించి హైకోర్టుకు నివేదిక ఇస్తామని భీమారావు స్పష్టం చేశారు.
ఏలూరు వాసులు భయపడాల్సిన అవసరం లేదు: జిల్లా జడ్జి భీమారావు
ఏలూరు వాసులు భయపడాల్సిన అవసరం లేదని జిల్లా జడ్జి భీమారావు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలతో రోగుల స్టేట్‌మెంట్ నమోదు చేశామన్నారు. లెడ్, నికెల్ కారకాలు ఉన్నట్లు ఎయిమ్స్ ప్రతినిధులు ద్వారా తెలిసిందని..ఇంకా పూర్తి నివేదిక రావాల్సి ఉందన్నారు.
ఏలూరు వాసులు భయపడాల్సిన అవసరం లేదు