పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో లాక్ డౌన్ సందర్భంగా స్థానికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామానికి చెందిన పలువురు కూరగాయలు పంపిణీ చేశారు. రూ. రెండు లక్షలు విరాళాలు సేకరించి పది టన్నుల కూరగాయలను గ్రామ ప్రజలకు అందజేశారు. గ్రామ వాలంటీర్లతో 2300 కుటుంబాలకు ఇంటింటికి పంపిణీ చేశారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఆచంటలో పేదలకు కూరగాయలు పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు పలువురు సహాయం చేస్తున్నారు. ఈ ఆపద సమయంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి తమ వంతు తోడ్పాటు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
పేదలకు కూరగాయలు పంపిణీ