పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రాముడుకుంట చెరువు ప్రాంతంలో నివసిస్తున్న పేద కుటుంబాలకు వైకాపా పార్టీ నాయకులు పోషకాహార వస్తువులు అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో పార్టీలకతీతంగా పలువురు దాతలు తమకు సహాయం చేస్తున్నారని పేద ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.
పేదలకు పోషకాహార వస్తువులు పంపిణీ - corona
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు పలువురు సహాయం చేస్తున్నారు. ఈ ఆపద సమయంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి తమ వంతు తోడ్పాటు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
పేదలకు పోషకాహార వస్తువుల పంపిణీ