పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు సహకార సంఘం త్రిసభ్య కమిటీ ఛైర్మన్ రాజశేఖర్ ఆధ్వర్యంలో మండలంలోని పది గ్రామాలకు చెందిన 12 వేల కుటుంబాలకు పండ్లు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి చేతుల మీదుగా వీటిని అందించారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే, సి-విటమిన్ అధికంగా ఉండే మామిడి, అరటి, జామ, నిమ్మ వంటి పండ్లను అందజేశారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అబ్బయ్య అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి వైరస్ వ్యాప్తిని నివారించాలని కోరారు. అత్యవసర సేవలందిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి అయన ధన్యవాదాలు తెలిపారు.
పెదపాడులో 12 వేల కుటుంబాలకు పండ్లు పంపిణీ - pedapadu latest news
పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలంలోని గ్రామాల ప్రజలకు స్థానిక సహకార సంఘం ఛైర్మన్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. విటమిన్-సి ఎక్కువగా ఉండే మామిడి, అరటి, జామ, నిమ్మ వంటి ఫలాలను అందించారు.
పెదపాడులో పేదలకు పండ్లు పంపిణీ