లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెదేపా సీనియర్ నేత రావూరి కృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డాంగేనగర్ లో 300 కుటుంబాలకు 13 రకాల నిత్యావసర సరకులు అందజేశారు.
లాక్ డౌన్ మరింత కాలం కొనసాగే అవకాశాలు ఉన్నందున పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదలను.. దాతలు ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ప్రభుత్వాల సూచనలు తప్పకుండా పాటించాలని ఆయన కోరారు.