ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్వర్‌ డౌన్‌..రేషన్ బియ్యం పంపిణీలో అవాంతరాలు - రేషన్ బియ్యం పంపిణీలో సర్వర్ సమస్య

రేషన్ బియ్యం పంపిణీ చేయటంలో సర్వర్ సమస్య ఏర్పడింది. సెప్టెంబర్ నెలలో రెండో విడత రేషన్ పంపిణీలో భాగంగా 20వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభించారు. సర్వర్ సమస్య వల్ల రేషన్ పంపిణీ కష్టమేనని డీలర్లు అంటున్నారు.

Disruptions in ration rice distribution Server down problem at westgodavari district
సర్వర్‌ డౌన్‌..రేషన్ బియ్యం పంపిణీలో అవాంతరాలు

By

Published : Sep 23, 2020, 3:28 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీలో సర్వర్లు మొరాయించాయి. రేషన్ డీలర్లు మూడు రోజుల్లో 29 శాతం మాత్రమే వినియోగదారులకు సరుకులు సరఫరా చేయగలిగారు. సెప్టెంబర్ నెలలో రెండో విడత రేషన్ పంపిణీలో భాగంగా 20వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభించారు. జిల్లాలో 12 లక్షల 74 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. సర్వర్ల సమస్యతో మొదటిరోజు జిల్లావ్యాప్తంగా రెండున్నర శాతం వినియోగదారులకు మాత్రమే రేషన్ పంపిణీ చేయగలిగారు. రెండో రోజు పరిస్థితి కొంత మెరుగుపడినా మూడో రోజు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

మూడు రోజుల్లో మొత్తం కార్డుల్లో 29.50 శాతం మందికి పంపిణీ జరిగినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం వినియోగదారుల వేలిముద్రల ఆధారంగానే రేషన్ పంపిణీ చేయాలన్న నిబంధన మేరకు ప్రత్యామ్నయ ఏర్పాటు వీలు కాదని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 28వ తేదీ వరకు రేషన్ పంపిణీ గడువు ఉన్నా.. సర్వర్ సమస్య వల్ల అప్పటివరకు రేషన్ పంపిణీ చేయటం కష్టమేనని డీలర్లు అంటున్నారు.

ఇదీ చదవండి:

ముగిసిన సీఎం దిల్లీ పర్యటన.. నేరుగా తిరుపతికి పయనం

ABOUT THE AUTHOR

...view details