తణుకులో మున్సిపల్ కార్మికుల ధర్నా - Dharna of municipal workers in Tanuku
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్‌కు అందజేశారు.
తణుకులో మున్సిపల్ కార్మికుల ధర్నా
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి. మున్సిపల్ కార్మికులకు రెండు నెలలుగా బకాయి ఉన్న ఆరోగ్య బీమా అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులు తమ క్యాజువల్ లీవ్‌లను వినియోగించేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రూ.50 లక్షల పరిహార నిబంధన అమలు చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి