పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం మాచవరం గ్రామంలో ఉపాధి హామీ కూలీలు మండల పరిషత్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. క్షేత్ర సహాయకుడు అడప నాగేశ్వరరావు.. తమను అసభ్యంగా దూషిస్తున్నాడని ఆరోపించారు.
దళితులైన తమను చులకనగా చూస్తూ మహిళా కూలీలను సైతం తప్పుడు మాటలతో ఇబ్బంది పెడుతున్నాడని చెప్పారు. అధిక సమయం పనిచేయిస్తున్నాడన్నారు. ఈ విషయంపై ఎంపీడీవో విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.