ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనధికార కట్టడాలను కూల్చివేసిన పంచాయతీ అధికారులు - west godavari district latest news

జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో అక్రమ కట్టడాలను పంచాయతీ అధికారులు కూల్చేశారు. నిబంధనలు పాటించని వాటిపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయని... అందుచేత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూల్చివేశామని ఈవో తెలిపారు.

dhaba destroyed by panchayat officers
లక్ష్మీపురంలో అక్రమ కట్టడాలు కూల్చివేత

By

Published : Oct 16, 2020, 7:09 PM IST

జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో అనధికార కట్టడాలను పంచాయతీ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న డాబాను ధ్వంసం చేశారు. కరోనా సమయంలో నిబంధనలు పాటించకుండా డాబా పనిచేసిందని... దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయని ఈవో సుబ్బరాయన్​ తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చి వేసినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details